అయితే, ఈ ప్రణాళిక అమరావతి రైతుల ఆందోళనలు, కోర్టు ఆటంకాలు, రాజకీయ వివాదాల మధ్య స్తబ్దతకు గురైంది. జగన్ ప్రభుత్వం ఈ మార్గదర్శకాలను అమలు చేయడానికి బిల్లులు పాసు చేసినప్పటికీ, పూర్తి అమలు జరగకపోవటంతో రాష్ట్ర అభివృద్ధి మొత్తం ఆలస్యమైంది. ఈ విధానం రాజకీయంగా వివాదాస్పదమై, టీడీపీ వర్గాలు దీన్ని అమరావతి భవిష్యత్తును బెదిరించేలా చూశాయి.
చంద్రబాబు నాయుడు 2024 ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చినప్పుడు మూడు రాజధానుల సిద్ధాంతాన్ని స్పష్టంగా తిరస్కరించారు. అమరావతిని ఏకైక రాజధానిగా చేస్తామని, స్వర్ణాంధ్ర 2047 ప్లాన్‌లో దాన్ని మాస్టర్ ప్లాన్‌తో అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసి, మూడు రాజధానుల ప్రణాళికను రద్దు చేసారు. అయితే, రాజకీయ ఒత్తిడి, ప్రాంతీయ సమతుల్యత కోసం చంద్రబాబు జగన్ విధానాన్ని మౌనంగా అమలు చేస్తున్నారనే ఆరోపణలు పెరుగుతున్నాయి.
విశాఖను గ్రోత్ ఇంజన్‌గా మలచడానికి 2032 నాటికి 120 బిలియన్ డాలర్ ఆర్థిక ప్రాంతంగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. గూగుల్ ఎఐ డేటా సెంటర్, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు, హెల్త్‌కేర్ హబ్‌గా మార్చడం వంటి ప్రణాళికలు విశాఖకు అగ్రస్థానం కల్పిస్తున్నాయి. ఇది జగన్ కవరేజ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ప్రతిపాదనకు సమానమేనని విమర్శకులు చెబుతున్నారు.కర్నూలు విషయంలో కూడా చంద్రబాబు జగన్ ఆలోచనలను అడుగుపడుతున్నట్టు కనిపిస్తోంది.
2024 నవంబరులో అసెంబ్లీలో ఏకగ్రీవంగా పాసైన రిజల్యూషన్ ద్వారా కర్నూలులో హైకోర్టు బెంచ్‌ను ఏర్పాటు చేయాలని కేంద్రానికి పంపారు. ఇది జగన్ ప్రణాళికలోని జ్యుడిషియల్ క్యాపిటల్‌కు దగ్గరైన చర్య. రాయలసీమ ప్రాంతీయ అభివృద్ధి కోసం డ్రోన్ హబ్, ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఇండస్ట్రీలు ప్రారంభించడం జరుగుతోంది. శ్రీబాగ్ ప్యాక్ట్ ఆధారంగా రాయలసీమకు న్యాయం చేయాలనే డిమాండ్‌లకు స్పందిస్తూ ఈ చర్యలు తీసుకున్నారు.
అయితే, ఇవి అమరావతి ఫోకస్‌ను తగ్గించి, మూడు ప్రాంతాల్లో అభివృద్ధి చేయాలనే జగన్ ఆలోచనను అమలు చేస్తున్నాయనే వాదనలు బలపడుతున్నాయి. రాజకీయంగా, ఇది టీడీపీకి అంతర్గత ఒత్తిడి సృష్టిస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి