ఈ మూడు జిల్లాలతో రాష్ట్రంలో మొత్తం జిల్లాల సంఖ్య ఇరవై తొమ్మిదికి చేరుకుంటుంది.పరిపాలనా సౌలభ్యం కోసం కొత్తగా ఐదు రెవెన్యూ డివిజన్లను కూడా ఏర్పాటు చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అనకాపల్లి జిల్లాలో నక్కపల్లి, ప్రకాశం జిల్లాలో అద్దంకి, మదనపల్లె జిల్లాలో పీలేరు, నంద్యాల జిల్లాలో బనగానపల్లె, సత్యసాయి జిల్లాలో మడకశిర డివిజన్లు రానున్నాయి. ఈ చర్యలతో స్థానిక సమస్యలు త్వరగా పరిష్కారమవుతాయని ప్రజలు ఆశిస్తున్నారు. అంతేకాదు కర్నూలు జిల్లాలో పెద్దహరివనాన్ని కొత్త మండలంగా రూపొందించడం, ఆదోని మండలాన్ని విభజించి మరో కొత్త మండలం సృష్టించడం వంటి నిర్ణయాలు కూడా ఆమోదం పొందాయి.
ఈ నిర్ణయాలు రాజకీయంగా చంద్రబాబుకు బలం చేకూర్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా రాయలసీమ, ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ పట్టు బలోపేతం కానుంది. స్థానిక నేతల డిమాండ్లు నెరవేరడంతో పార్టీలో అసంతృప్తి తగ్గి ఐక్యత పెరుగుతుందన్న వాదన కూడా బలంగా వినిపిస్తోంది. 2029 ఎన్నికల నేపథ్యంలో ఈ చర్యలు టీడీపీకి ఎనలేని ఊపు ఇస్తాయన్న విశ్వాసం కనిపిస్తోంది.పరిపాలనా సౌకర్యం పేరుతో జిల్లాలు పెంచడం ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే అయినప్పటికీ ప్రజలకు సమీపంలోనే సేవలు అందే అవకాశం పెరుగుతుంది.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి