కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అమరావతి పర్యటన రాబోతుండటంతో రైతులు క్యాపిటల్ గెయిన్స్ మినహాయింపును మరో రెండేళ్లు పొడిగించేలా కేంద్రాన్ని కోరాలని ముఖ్యమంత్రిని కోరారు. ఈ అంశంపై సానుకూలంగా స్పందించిన చంద్రబాబు తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.రైతులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను పరిష్కరించేందుకు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసినట్టు ముఖ్యమంత్రి వెల్లడించారు. పరిష్కరించదగిన అన్ని అంశాలను ఈ కమిటీ త్వరలోనే చర్చించి పరిష్కారం చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
రాజధాని పరిధిలోని 29 గ్రామాలతో మాత్రమే అమరావతి పూర్తిస్థాయి రాజధానిగా ఎదగలేదని స్పష్టం చేశారు. హైదరాబాద్ నమూనాలో అభివృద్ధి సాధ్యం కావాలంటే విస్తృత ప్రాంతం అవసరమని పేర్కొన్నారు. ప్రస్తుత పరిధితోనే కొనసాగితే అమరావతి కేవలం మున్సిపాలిటీ స్థాయికే పరిమితమవుతుందని హెచ్చరించారు.పూర్తిస్థాయి రాజధానిగా అమరావతి రూపుదిద్దుకోవాలంటే తాను తీసుకునే నిర్ణయాలకు రైతులు పూర్తి మద్దతు ఇవ్వాలని చంద్రబాబు సూటిగా కోరారు. రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులపై తనకు అపార అభిమానం ఉందని భావోద్వేగంతో చెప్పారు.
రాజధాని అభివృద్ధి దిశగా తీసుకునే ప్రతి అడుగులో రైతుల సహకారం కీలకమని నొక్కి చెప్పారు. ఈ సందర్భంగా రైతులు కొందరు కావాలని సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి