ప్రభుత్వం ఈ ఘటనలను ఖండించినప్పటికీ నియంత్రణ సాధ్యం కాకపోవడం దేశంలోని రాజకీయ అస్థిరతను బయటపెట్టింది. ముహమ్మద్ యూనుస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఫిబ్రవరి ఎన్నికలకు సన్నాహాలు చేస్తున్న తరుణంలో ఇలాంటి అరాచకం దేశ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తోంది. రాడికల్ గ్రూపులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని రాజకీయ లాభాలు ఆశిస్తున్నాయి.ఈ అల్లర్లలో యాంటీ ఇండియా ధోరణి స్పష్టంగా కనిపిస్తోంది.
చిట్టగాంగ్‌లో ఇండియన్ అసిస్టెంట్ హైకమిషన్‌పై దాడి జరిగింది. ఢాకాలో ఇండియన్ సాంస్కృతిక ప్రచార సంస్థలను టార్గెట్ చేసి ఇండియన్ ఏజెంట్లుగా ముద్ర వేశారు. ఈ హింసలో మైనారిటీలు ముఖ్యంగా హిందువులు ఎక్కువగా బాధితులయ్యారు. ఇంటరిమ్ ప్రభుత్వం నియంత్రణ కోల్పోవడం వల్ల రాడికల్ ఇస్లామిస్ట్ గ్రూపులు బలపడుతున్నాయి.
ఈ అస్థిరత భారత్‌కు పెద్ద సవాలుగా మారింది. సరిహద్దు రాష్ట్రాలైన అస్సాంలో హై అలర్ట్ ప్రకటించారు. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌ను బలోపేతం చేశారు. ఇండియన్ వీసా సెంటర్లు తాత్కాలికంగా మూసివేయబడ్డాయి. చైనా, పాకిస్తాన్ ప్రభావం పెరిగే అవకాశం కనిపిస్తోంది.మొత్తంగా బంగ్లాదేశ్‌లోని ఈ మూకల రెచ్చిపోవడం కేవలం అక్కడి అంతర్గత సమస్య మాత్రమే కాదు. ఇది భారత్ సరిహద్దు భద్రతకు, ద్వైపాక్షిక సంబంధాలకు నేరుగా సవాలు విసురుతోంది.భారత్ ఈ పరిణామాలను దగ్గరగా గమనిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది.
9490520108.. వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి