హైకోర్టు గతంలో ప్రభుత్వానికి మొట్టికాయలు వేసినా తీరు మారలేదని విమర్శించారు. థియేటర్ల కంటే సచివాలయంలోనే పెద్ద సస్పెన్స్ థ్రిల్లర్ నడుస్తోందని సెటైర్ వేశారు. ప్రభుత్వం పాలసీలతో కాకుండా పగతో నిర్ణయాలు తీసుకుంటోందని ఆరోపించారు. మూడు సినిమాలకు ఇప్పటికే రేట్లు పెంచుతూ జీవోలు ఇచ్చారని మరో సినిమాకు కూడా అనుమతి రాబోతోందని పేర్కొన్నారు.ఈ వివాదం ప్రభాస్ నటించిన ది రాజాసాబ్ చిత్రంతో మొదలైంది.
ఆ సినిమాకు టికెట్ ధరల పెంపుకు అర్ధరాత్రి జీవో జారీ చేశారు. హైకోర్టు దాన్ని నిలిపివేసింది. భవిష్యత్తులో కొత్త సినిమాలకు ఇలాంటి అనుమతులు ఇవ్వకూడదని ఆదేశించింది. మన శంకరవరప్రసాద్ గారు సినిమాకు కూడా ఇదే సమస్య వచ్చింది. ప్రభుత్వం జీవో 120 ప్రకారం మాత్రమే రేట్లు నిర్ణయించాలని కోర్టు స్పష్టం చేసింది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ జీవోలకు తన సంబంధం లేదని ప్రకటించారు.
ఫైల్స్ తన దగ్గరకు రాలేదని చెప్పారు. ఇది ప్రభుత్వంలోని అసమన్వయాన్ని తెలియజేస్తుంది. హరీశ్ రావు ఈ అంశంపై గవర్నర్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కమీషన్ల దందా జరుగుతోందని ఆరోపణలు చేశారు.ప్రభుత్వం అసెంబ్లీలో టికెట్ రేట్లు పెంచబోమని ప్రకటించినా తర్వాత రాత్రికి రాత్రి జీవోలు ఇస్తోంది. ఇది ప్రజలపై భారం మోపుతుందని హరీశ్ రావు అన్నారు. నచ్చిన సినిమాలకు మాత్రమే అనుమతి ఇస్తారా అని ప్రశ్నించారు.
9490520108.. ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ నియోజకవర్గాల్లో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి. రెండు రాష్ట్రాల్లో నియోజకవర్గాల వారీగా సమస్యలు, ఎమ్మెల్యేల పనితీరు, వారు ఇచ్చిన హామీలు, ప్రజల ఇబ్బందులు, అక్కడ అధికార, ప్రతిపక్ష పార్టీల పరిస్థితులు, రాజకీయ అంశాలపై కూడా మీ అభిప్రాయం మాతో పంచుకోండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి