తెలంగాణలో ఇంజినీరింగ్ సీట్ల లెక్కింపు పూర్తి..164 కాలేజీల్లో ఉన్న 47,046 బీటెక్ సీట్లు కేటాయించారు. 13 యూనివర్సిటీలు, 35 ప్రైవేట్ కళాశాలల్లో సీట్లన్నీ భర్తీ అయ్యాయి. మూడు ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో ఒక్క సీటు కూడా భర్తీ కాలేదు. ఇంజినీరింగ్ కళాశాల లో ఉన్న అన్నీ కోర్స్ లు పూర్తి అయినట్లు తెలిపారు.అక్టోబర్ 28 న సీట్లను కన్ఫర్మ్ చేస్తున్నారు లేదో చెప్పాలని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిత్తల్ సూచించారు. ఈ నెల 29 నుంచి తుది విడత ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు నవీన్ తెలిపారు.