ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన జేఎన్టీయూహెచ్..సప్లిమెంటరీ ఎగ్జామ్స్‌లో 7.5 GPA వచ్చినా డిస్టింక్షన్ ఇవ్వాలని నిర్ణయించింది. అంతేకాదు సప్లిలో పాసైనవారిని రెగ్యులర్‌గానే పరిగణించనున్నారు. కాగా.. ఇప్పటిదాకా 192 క్రెడిట్స్ వస్తేనే పాసైనట్లు పరిగణించగా.. ప్రస్తుతం దీన్ని 186 క్రెడిట్స్‌కు తగ్గించారు.దీనితో పాటుగా యునివర్సిటీ కింద జరగవలసిన అన్నీ పరీక్షలను వెంటనే జరిపించాలని జేఎన్టీయూహెచ్ సత్వర ఆలోచనలను చేస్తుంది..