ప్రముఖ వాణిజ్య బ్యాంక్ ఎస్బీఐ శుభవార్తను అందిస్తుంది.. ఏకంగా 8500 అప్రెంటీస్ పోస్టుల్ని ప్రకటించింది. దేశంలోని వేర్వేరు జోన్లలో ఈ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా పోస్టులు ఉన్నాయి. ఇవి మూడేళ్ల అప్రెంటీస్ పోస్టులు మాత్రమే. వీరిని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగులుగా గుర్తించరు. ఈ విధానం ద్వారా ఎంపికైన వారికి మూడేళ్ల పాటు అన్నీ వసతులను కల్పించి ట్రైనింగ్ ను కూడా ఇస్తారు...