ఛత్తాబజార్లోని జమాతె ఇస్లామీ హింద్ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జమాతె ఇస్లామీ హింద్ జాతీయ అధ్యక్షుడు మౌలానా సయ్యద్ సాదతుల్లా ఓ సమావేశంలో మాట్లాడుతూ..తెలుగులో రాయడం, చదవడం, మాట్లాడటంలో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్న జమాతె ఇస్లామీ హింద్ సంస్థను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. జమాతె కార్యదర్శి ఖాలిద్ ముబష్షిర్, కోర్సు కోఆర్డినేటర్ అబ్దుల్ వాహెద్ మాట్లాడుతూ, గత నాలుగు నెలలుగా తాము నిర్వహిస్తున్న తెలుగు కోర్సులకు మంచి స్పందన వస్తోందని చెప్పారు. ముస్లిం ల కోసం తాము ప్రచురిస్తున్న పుస్తకాలకు మంచి స్పందన వస్తోందనీ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు..