అమ్మఒడి పథకం 2020- 21 సంవత్సరం కొనసాగింపులో భాగంగా జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తమ పాఠశాలల ఛైల్డ్ఇన్ఫో అంతర్జాలంలో నమోదు చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి శైలజ తెలిపారు. ఈ నెల 15వ తేదీలోగా ఈ పథకానికి సంబంధించిన అన్నీటిని పూర్తి చేయనున్నారు. జగనన్న అమ్మఒడి పథకం ద్వారా 2021 జనవరి 9వ తేదీన రూ.15వేలు అందాలంటే పీఎస్, యూపీఎస్, హెచ్ఎస్ ప్రధానోపాధ్యాయులందరూ తప్పనిసరిగా విద్యార్థులందరి వివరాలను ఛైల్డ్ఇన్ఫోలో ఉండేటట్లు చూడాలని పేర్కొన్నారు.