పదో తరగతి పరీక్షలను ఈ ఏడాది ఆరు ప్రశ్నపత్రాలకే పరిమితం చేయనున్నారు. అంతకుముందు 11 ప్రశ్నపత్రాలు ఉండగా కరోనా కారణంగా గతేడాది ఆరు పేపర్లకు తగ్గించినట్లు ప్రకటించినా.. తుదకు పరీక్షలే జరపలేదు. అప్పట్లో ఈ ఉత్తర్వులు ఆ ఏడాదికేనని ప్రభుత్వం పేర్కొంది. అవే ఉత్తర్వులు ఈ ఏడాదికీ పొడిగించే అవకాశం ఉంది. 2019-20లో మొదట అంతర్గత మార్కులు, బిట్ పేపర్‌ను తొలగించారు. ప్రతి సబ్జెక్టులోనూ 100 మార్కులకు ప్రశ్నలే ఉండేలా మార్పు చేశారు.. అయితే ఈ విధానంలో ఒక్క ప్రశ్న పత్రంతో పరీక్షలు నిర్వించనున్నట్లు తెలుస్తుంది..