రూరల్ మేనేజ్మంట్ పీజీ, ఎంబీఏ, ఇతర స్పెషలైజ్డ్ కోర్సులు పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ప్రారంభంలో సగటున రూ.3లక్షల వరకూ వార్షిక వేతనంలో లభిస్తోంది. పలు కార్పొరేట్ సంస్థలు ప్రముఖ ఇన్స్టిట్యూట్స్లో క్యాంపస్ డ్రైవ్స్ సైతం నిర్వహించి.. ప్రాజెక్ట్ మానిటరింగ్ ఆఫీసర్, ప్రాజెక్ట్ మేనేజర్, ప్రోగ్రామ్ మేనేజర్ హోదాల్లో నియామకాలు చేపట్టి సగటున రూ.8 లక్షల వార్షిక వేతనం అందిస్తున్నాయి. అలాగే అనుభవం, నైపుణ్యాల ఆధారంగా రూ.12 లక్షల వరకు ఏడాదికి వేతనం అందుకునే అవకాశం ఉంది.