ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.. ప్రజల సంతోషం కోసం జగన్ వరుస పథకాలను అమల్లోకి తీసుకు వస్తున్నారు. ఇప్పుడు ఏపి లోని నిరుద్యోగులకు ఊరట కలిగించే వార్తను అందించారు.ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ పథకం లోప్రస్తుతం ఉన్న 1889 రకాల వ్యాధులతో పాటు ఈనెల 19వ తేదీ నుంచి అదనంగా మరో 46 రకాల క్యాన్సర్ చికిత్స విధానాలను చేర్చారు. ఈ విషయాన్ని వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ముఖ్య కార్య నిర్వహణ అధికారి డాక్టర్ మల్లిఖార్జున తెలియజేయజేశారు.