ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఫ్రెషర్స్‌కు ఎక్కువ అవకాశాలు ఇచ్చేలా కనిపిస్తున్నాయి. టీసీఎస్, విప్రో మాత్రం నిరుడు మాదిరిగానే ఈసారీ నియామకాలు చేపట్టాలని చూస్తున్నట్లు తెలుస్తున్నది. మొత్తంగా ఈ 4 సంస్థలు కలిసి క్యాంపస్‌ల నుంచి 91వేల మంది కొత్తవారిని తీసుకోనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం దేశీయ ఐటీ రంగ దిగ్గజం టీసీఎస్ 40వేల మంది ఫ్రెషర్స్‌కు ఉద్యోగాలిచ్చింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ ఇంతే స్థాయిలో నియామకాలుంటాయని సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, గ్లోబల్ హెచ్ఆర్ హెడ్ మిలింద్ లక్కడ్ ఇటీవలి మీడియా సమావేశాల్లో తెలిపారు