ఇంటర్ విద్యార్థులకు మే 3 నుంచి పరీక్షలను నిర్వహించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల ప్రశ్నపత్రాల్లో ఈసారి ఛాయిస్ 50 శాతానికి పెరగనుంది. ఈ మేరకు ప్రభుత్వ ఆమోదం కోసం ఇంటర్‌బోర్డు ప్రతిపాదనలు పంపనుంది. కరోనా పరిస్థితుల్లో విద్యార్థులకు కొంత వెసులుబాటు ఇవ్వాలని భావిస్తున్న బోర్డు అధికారులు ఛాయిస్ పెంపుపై ఇటీవల పలు చర్చలు చేశారు.ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ప్రశ్నపత్రాల్లో, ముఖ్యంగా ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో ప్రతి దాంట్లో మూడు సెక్షన్లు ఉండగా..అందులో రెండింటికీ 50% ప్రశ్నలకు సమాధానాలు రాయాలి.