ప్రభుత్వం ఎంతగా కొత్త పథకాలను తీసుకొచ్చిన కూడా అటు వైపే వెళ్లడం గమనార్హం. రాష్ట్ర ప్రభుత్వం ఏటా పాఠశాల విద్యపై రూ.10వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తోందని, డిమాండ్ మేరకు ఇంగ్లిషు మీడియం పాఠశాలలు ప్రారంభించినా ఎక్కువ మంది ప్రభుత్వ ఉద్యోగులు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లోనే చదివిస్తున్నారని పీఆర్సీ నివేదిక ప్రస్తావించింది.ఉద్యోగులు వీటిని వినియోగించుకోక పోవడంతో ప్రభుత్వ విద్యపై ఇతరుల్లోనూ మంచి అభిప్రాయం ఉండటం లేదని పేర్కొంది. ఈ నేపథ్యంలో అట్టడడుగు కుటుంబాలు ఇబ్బందులను ఎదర్కొంటున్నారని వెల్లడించారు.