విద్యార్థులకు నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. కరోనా వల్ల ఉద్యోగాలు పోయిన నిరుద్యోగులకు ఓ ప్రముఖ కంపెనీ చక్కని అవకాశాన్ని కల్పిస్తుంది. ప్రముఖ ఐటీ కంపెనీలో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఈ మేరకు క్యాప్ జెమిని ఈ ఏడాది భారత్లో భారీగా ఉద్యోగులను నియమించుకోనుంది తెలుస్తుంది. 2021లో భారత దేశంలో సుమారు 30,000 మందిని ఐటీ ఉద్యోగులను నియమించుకోవాలని భావిస్తున్నట్లు క్యాప్ జెమిని సీఈవో అశ్విన్ యార్డి తాజాగా వెల్లడించారు. ఫ్రెషర్స్తో పాటు అనుభవజ్ఞులకు కూడా అవకాశం కల్పిస్తామన్నారు.