ఏపి రాష్ట్రంలోని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తించిన వైద్య సిబ్బందికి గుడ్ న్యూస్ చెప్పింది. బోధనాస్పత్రులు, వైద్య, డెంటల్ కళాశాలల్లో పనిచేసే బోధనా వైద్యులకు రాష్ట్ర ప్రభుత్వం వేతన సవరణ చేసింది. ఈ మేరకు సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు మార్చి 1 నుంచి అమలులోకి వస్తాయని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం తాజాగా తీసకున్న ఈ నిర్ణయంతో దాదాపు 4 వేల మంది వైద్యులకు లబ్ధి చేకూరనుంది. 7వ సెంట్రల్ పే కమిషన్ ఫార్ములా ప్రకారం వేతనాలను పెంచినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.