నిరుద్యోగులకు చక్కటి శుభవార్త.. ప్రభుత్వ రంగ సంస్థ లో ఖాళీలు ఉన్న ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.. ఇప్పటికే చాలా ప్రభుత్వ శాఖలకు సంబందించిన పోస్టులను విడుదల చేసింది. ఇప్పుడు కూడా మరో సంస్థ లో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థల నుంచి వరుసగా ఉద్యోగా ప్రకటనలు విడుదల అవుతున్నాయి. తాజాగా నేషనల్ మినరల్ డవలప్మెంట్ కార్పొరేషన్(NMDC) నుంచి ఉద్యోగ ప్రకటన విడుదలైంది. జూనియర్ ఆఫీసర్ విభాగంలో 63 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఆయా పోస్టులకు అప్లై చేయడానికి మార్చి 23ని ఆఖరి తేదీగా నిర్ణయించారు.