ఇంజనీరింగ్ విద్యార్థులకు ఏఐసీటీఈ గుడ్ న్యూస్ చెప్పింది.ఇంజినీరింగ్ విద్య అభ్యసించేందుకు ఇకపై 10+2 స్థాయిలో మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులు తప్పనిసరి కాదని ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యూకేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఏఐసీటీఈ ఇటీవల 2021-22 సంవత్సరాని కి సంబంధించిన హ్యాండ్ బుక్ లను అందించింది.బీఈ, బీటెక్ కోర్సుల్లో ప్రవేశం పొందేందుకు 12వ తరగతి స్థాయిలో మాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులను ఆప్షనల్ చేసింది.