మోదీ సర్కార్ తీసుకొచ్చిన గొప్ప సంస్కరణగా ఈ నిర్ణయాన్ని పేర్కొనవచ్చని ఆయన అన్నారు.. దేశ వ్యాప్తంగా ఈ అవకాశాలను కల్పిస్తున్నారు. ఈ నిర్ణయం వల్ల మహిళలు, దివ్యాంగ అభ్యర్థులకు ప్రయోజనం చేకూరుతుందని ఆయన వెల్లడించారు. నిరుద్యోగ అభ్యర్థులకు గతంతో పోలిస్తే రవాణా ఖర్చులతో పాటు పరీక్ష ఫీజులు కూడా భారీగా తగ్గుతాయని ఆయన పేర్కొన్నారు. 2021 సంవత్సరం సెప్టెంబర్ నెలలో ఈ పరీక్ష జరగనుందని తెలుస్తోంది. కేంద్రమంత్రి జీతేంద్ర సింగ్ ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమయ్యే విద్యార్థులకు ఈ అవకాశం ఉపయోగ పడుతుందని పేర్కొన్నారు.