స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. బిజినెస్ కరస్పాండెంట్ ఫెసిలిటేటర్, ఎగ్జిక్యూటీవ్ విభాగాల్లో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు మార్చి 21లోగా అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.అభ్యర్థులు బ్యాంక్ లో సేవలు అందించి రిటైర్ అయి ఉండాలి. అభ్యర్థి సర్వీసులోని చివరి ఐదేళ్లలో ఎలాంటి పనిష్మెంట్, పెనాల్టీకి గురై ఉండకూడదు. అలాంటి వారు అప్లై చేయడానికి అనర్హులు. సీబీఐ లేదా ఇతర ఏ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ కేసులు పెండింగ్ లో ఉన్న అభ్యర్థులు కూడా అప్లై చేయడానికి అనర్హులు...