తెలంగాణ సర్కార్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ ప్రభుత్వ ఉద్యోగులకు ఊరటను కలిగిస్తుంది. ఎన్నాళ్ళ నుంచో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేతన సవరణ ప్రకటన ఉద్యోగులకు ఊరటనూ కలిగిస్తుంది.ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు ముఖ్యమంత్రి కేసీఆర్ తీపి కబురు చెప్పారు. అసెంబ్లీ వేదికగా ఉద్యోగులకు 30శాతం పీఆర్సీని ప్రకటించారు. ఏప్రిల్ 1 నుంచి పీఆర్సీ అమల్లోకి వస్తుందని తెలిపారు. అలానే ఉద్యోగుల పదవీ విరమణ వయసును 61 ఏళ్లకు పెంచుతున్నట్లు ప్రకటించారు..