హైదరాబాద్ నగరంలో నిరుద్యోగులు డిగ్రీ పట్టా పట్టుకొని ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా సరైన ఉద్యోగం దొరకడంలేదు. జాబ్ చేయడానికి అవసరమైన నైపుణ్యాలు లేకపోవడమే అందుకు ముఖ్య కారణం. అనేక ఇంటర్వ్యూలకు వెళ్లిన తరువాత గాని వారికి ఈ సంగతి అర్థం కావడంలేదు. ఎక్కువ మార్కులు సంపాదించి ఇంటర్ లేదా డిగ్రీ, బీటెక్, పాస్ కావడమే లక్షంగా చదివిన విద్యార్థులు. ఉద్యోగం కోసం నైపుణ్యాలు నేర్చుకోవాలనే విషయాన్ని గుర్తించడం లేదు. మరి అలాంటి నైపుణ్యాలు ఎక్కడ నేర్పుతారు అనే సందేహాలకు సమాధానమే"నిర్మాణ్" వారి స్మార్ట్ ఉచిత శిక్షణ కేంద్రం. 

నిర్మాణ్ ద్వారా శిక్షణ పొంది ఉద్యోగం చేస్తున్నా స్టూడెంట్స్....  
1)  ఈ.సంధ్య:
మేము మోగుడం పల్లి గ్రామం సంగారెడ్డి జిల్లాలో లో మా అమ్మానాన్నలు వ్యవసాయ కూలీలుగా పని చేస్తారు చదువుకోవడానికి కూడా డబ్బులు లేని పేదరికంలో కూడా మా తల్లిదండ్రులు నన్ను కష్టపడి చదివించారు. నేను 2019లో బి టెక్ చదువు పూర్తి చేసి చాలా కంపెనీస్ లో ఇంటర్వ్యూ కి అటెండ్ అయ్యాను కానీ టెక్నికల్ గా మరియు కమ్యూనికేషన్ స్కిల్స్ వల్ల నేను సెలక్ట్ అవ్వలేక పోయాను అదే సమయంలో నిర్మాణ సంస్థ నైపుణ్య శిక్షణ ఇస్తున్నారని తెలిసి వెబ్ & మొబైల్ అప్లికేషన్ డిజైనింగ్ ట్రైనింగ్ లో పరిజ్ఞానం పొందాను.   నా ప్రతిభను గుర్తించిన నిర్మాణ్ సంస్థ ఈటీవీ భారత్, రామోజీ గ్రూప్ లో సాఫ్ట్వేర్ డెవలపర్ గా పనిచేస్తూ (నెలకు 14,500) హ్యాపీ గా జీవిస్తున్నాను. ఆదాయంలో కొత్త మొత్తాన్ని నా తల్లిదండ్రులకు పంపిస్తూ మా కుటుంబ బాధ్యతలు పాలు పంచుకుంటున్నాను.


2.వి.ఈశ్వర్: 
మేము సఫిల్ గూడ సికింద్రాబాద్ లో నివసిస్తున్నాము మా నాన్న ప్రైవేట్ కంపెనీలో చిన్న జాబ్ చేస్తాడు. నేను 2017 లో బిటెక్ పూర్తి చేసి చాలా ఇంటరెస్ట్ కి అటెండ్ అయ్యాను కానీ నాకు సరి అయిన స్కిల్స్ లేకపోవడంతో జాబ్ కి సెలెక్ట్ అవ్వలేదు, ఆ తర్వాత 40 వేలు ఖర్చు పెట్టి చాలా ట్రైనింగ్ తీసుకున్నాను కానీ లాభం లేకపోయింది. 2019 జూన్ ఆ సమయంలో లో నిర్మాణ్‌ సంస్థ నుండి ఒక మెసేజ్ వచ్చింది. ఆ తక్షణమే నేను నిర్మాణ్‌ శిక్షణ కేంద్రంలో చేరి నా యొక్క టెక్నికల్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ని పెంపొందించుకో గలిగాను.


 నా ప్రతిభను గుర్తించిన నిర్మాణ్‌ సంస్థ సైబర్ టెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రోగ్రామర్ గా పనిచేస్తూ (నెలకు 10,000) హ్యాపీగా జీవిస్తున్నాను. ఇలాంటి మంచి అవకాశాన్ని కల్పిస్తున్న నిర్మాణ్‌ సంస్థకు రుణపడి ఉంటాను. సంధ్య, ఈశ్వర్  లాంటి పేద యువతీ యువకులకు అండగా నిలబడిని సంస్ధ 'నిర్మాణ్‌ ' గ్రామీణ పేద యువతకు నైపుణ్య శిక్షణను ఇచ్చి , జీవితంలో స్ధిరపడేలా వారికి ప్లేస్‌ మెంట్‌ కల్పించడం నిర్మాణ్‌ లక్ష్మం. ఉన్నత చదువులు చదివి నిరుద్యోగులుగా నిరాశకు లోనవకుండా నిర్మాణ్‌ ను సంప్రదించండి. 



నిరంతరం శిక్షణ :
పదవ తరగతి నుంచి మొదలు బీటెక్‌ వరకు చదువుగల నిరుద్యోగ యువతీ యువకులకు కంప్యూటర్ బేసిక్స్, స్పోకెన్ ఇంగ్లీష్, ఇంగ్లిష్ టైపింగ్, ఇంటర్నెట్ పరిజ్ఞానం, అకౌంట్స్, జియస్టి, అడ్వాన్స్డ్ ఎక్సెల్ మరియు సాఫ్ట్‌వేర్‌ కోర్సులలో శిక్షణ ఇస్తున్నారు. గతంలో ఇక్కడ శిక్షణ పొందిన వారు, డెల్‌, టెక్‌ మహీంద్ర, కాప్‌ జెమిని, ఐకియా, టిసి యస్, వెస్ట్ సైడ్, రేడియంట్, అపోలో, లాంటి ప్రముఖ కంపెనీలలో ఉద్యోగాలు పొందారు. అసలీ నైపుణ్య శిక్షణను ఉచితంగా ఇవ్వాలని నిర్మాణ్‌ సంకల్పం.


బీటెక్ నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి తో కూడిన శిక్షణ :

టెక్ మహీంద్రా ఫౌండేషన్ మరియు నిర్మాణ్ BITS pilani  పూర్వ విద్యార్థులు ప్రారంభించిన స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో Btech, 2017, 2018& 2019లలో పాసై మరియు కంప్యూటర్ అవగాహన ఉన్న నిరుద్యోగ యువతీ యువకులకు  HTML,CSS,BOOTSRAP,CORE JAVA(OOPS), ANDROID application DEVELOPMENT,ANGULAR, ,BUSINESS english, interview SKILLS  వంటి సాఫ్ట్వేర్ ప్యాకేజీ కోర్సులలో శిక్షణ ఇచ్చి అనంతరం Capgemini,Dell,wipro,Nexiilabs లాంటి  ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలలో ఉద్యోగావకాశాలను కల్పిస్తున్నాము. ఆసక్తిగల అభ్యర్థులు  H.no 7-1-621/92 32/3RT , 3rd floor,Opp.Canara bank,Umesh chandra statue road,SR nagar, Hyd-38 లో గల తమ శిక్షణ కేంద్రంలో ధరఖాస్తు చేసుకోగలరు. దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరి తేదీ 8th Nov.  


ఆసక్తిగల అభ్యర్థులు  బిటెక్ వారు కెనరా బ్యాంక్ ఆపోజిట్, ఉమేష్ చంద్ర స్టాచ్యూ రోడ్, ఎస్.ఆర్.నగర్ లోని నిర్మాణ్‌ టెక్‌ మహేంద్ర ఫౌండేషన్‌ శిక్షణ కేంద్రంలో.  పదవ తరగతి నుంచి డిగ్రీ విద్యార్థులు కూకట్పల్లి బస్టాప్ దగ్గర గల నిర్మాణ్‌ టెక్‌ మహేంద్ర ఫౌండేషన్‌ శిక్షణ కేంద్రంలో ధరఖాస్తు చేసుకోవచ్చు ఈ  శిక్షణ కేంద్రాలలో ప్రతీ 3 నెలలకు ఒక సారి శిక్షణా కార్యక్రమం ఉంటుంది. మరిన్ని వివరాలకు, 76759 14735 / 36  నెంబర్లను సంప్రదించగలరు.




మరింత సమాచారం తెలుసుకోండి: