చెన్నైలోని ఐసీఎంఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడిమియాలజీ (ఎన్ఐఈ) కాంట్రాక్ట్ బేసిస్ మీద 66 పోస్టుల భర్తీకి వాక్ఇన్ నిర్వహిస్తోంది. ప్రాజెక్ట్ సైంటిస్ట్ (నాన్మెడికల్), ప్రాజెక్ట్ టెక్నికల్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ సీనియర్ ఇన్వెస్టిగేటర్, ప్రాజెక్ట్ టెక్నీషియన్, తదిత ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
ఈ మొత్తం 66 రకాల్లో ఒక్కో ఉద్యోగానికి ఒక్కో అర్హత ఉంది. పోస్టుని బట్టి పదోతరగతి, ఇంటర్మీడియట్, సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత అవసరం. కొన్ని ఉద్యోగాలకు అనుభవం పరిగణనలోకి తీసుకుంటారు.
వాక్ఇన్ తేదీలు.. నవంబరు 26, 27, 28 మరియు.. డిసెంబరు 04, 05 తేదీల్లో హాజరు కావచ్చు. వాకిన్ ఇంటర్వ్యూలకు హాజరయ్యేవారు చెన్నై వెళ్లాల్సి ఉంటుంది. చెన్నైలోని ఐసీఎంఆర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడిమియాలజీ, టీఎన్హెచ్బీ, అయపక్కం, చెన్నై-600077. చిరునామాలో హాజరుకావాల్సి ఉంటుంది.
ఈ వాకిన్ ఇంటర్వ్యూలకు హాజరు అయ్యే వారు. తమ తమ సర్టిఫికెట్లు ఒరిజినల్ లేదంటే.. జీరాక్స్ కాపీలు తప్పనిసరిగా తీసుకువెళ్లాలి. మరిన్ని వివరాలకు వెబ్సైట్: http://www.nie.gov.in/ ను పరిశీలించుకోవచ్చు.