జగన్ సీఎం అయ్యాక విద్యారంగంపై బాగా దృష్టి పెట్టారు. అక్షరాస్యత పెంచేందుకు, విద్యావ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే అమ్మ ఒడి కార్యక్రమాన్ని రూపొందించారు. పిల్లలను బడికి పంపే తల్లికి ఏటా 15 వేల రూపాయలు ఇస్తున్నారు. ఇప్పుడు కేవలం తల్లిదండ్రులకే కాదు.. పిల్లలకూ ఓ గుడ్ న్యూస్ చెప్పారు జగన్.

 

అదేంటంటే.. ఏపీ వ్యాప్తంగా 45 వేల పైచిలుకు పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం ద్వారా కొత్త మెనూ అమలవుతుందట. ఈనెల 21 నుంచి మధ్యాహ్న భోజన పథకంలో నూతన మెనూ అమలవుతుందట. అన్నిచోట్ల ఒకే రకమైన నాణ్యత, రుచి ఉండేలా చూడాలని సీఎం ఆదేశించారు. మధ్యాహ్న భోజన పథకం అమలులో నాలుగు అంచెలుగా తనిఖీలు ఉంటాయి.

 

తల్లిదండ్రుల కమిటీ, గ్రామ సచివాలయ సిబ్బంది, సెర్ప్‌ నుంచి తనిఖీలు ఉంటాయి. నాడు-నేడు, జగనన్న మధ్యాహ్న భోజన పథకం.. మౌలిక వసతుల కల్పన ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నారు. పాఠశాలల్లో మరుగుదొడ్లు నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టబోతున్నారు. ఇక మెనూలో పులిహోరా, కిచిడి, వారానికి మూడు రోజులు వేరుశనగ చిక్కీ, గుడ్డు వంటి పౌష్టికాహారం అందించబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: