కరోనా పుణ్యమా అంటూ జనాలు అన్నీ కోల్పోయి రోడ్డున పడ్డారు. ఉద్యోగాలు పోవడం తో పాటుగా ప్రాణాల ను కూడా పోగొట్టుకుంటున్నారు.. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల లో నిరుద్యోగ సమస్య పెరిగి పోయింది. ఈ సమస్య నుంచి జనాల ను బయటకు తీసుకురావడానికి ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రముఖ సంస్థల్లొ ఉన్న ఖాలీలను భర్తీ చేసెందుకు నోటిఫికెషన్ ను విడుదల చేస్తున్నారు... ముఖ్యంగా ఏపి సర్కార్.. ఇప్పటికే రాష్ట్రం లో ఉన్న విద్యార్థులకు ఉద్యోగాలు కల్పించింది.


ఏపి స్టేట్ స్కిల్ డవలప్మెంట్ ను ఏర్పాటు చేసింది. ఇందులో రాష్ట్రం లో ఉంటున్న కొత్త ఉద్యొగాల కు సంబంధించిన వివరాల ను ఎప్పటికప్పుడు విడుదల చేస్తూ వస్తున్నారు. తాజాగా మరో సంస్థ లో ఖాళీలు ఉన్నట్లు తెలిపింది. వివరాల్లొకి వెళితే.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ లో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు.రిలేషన్షిప్ ఎగ్జిక్యూటీవ్ పోస్టుల కు దరఖాస్తు చేసుకొవచ్చు అని బ్యాంక్ వెల్లడించారు..అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.


అభ్యర్థుల ను ఫోన్ ఇంటర్వ్యూ, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేసుకొంటున్నట్లు తెలిపారు. మొత్తం 20 ఖాళీలు ఉన్నాయి.. ఏదైనా గుర్తింపు పొందిన విద్యాలయాల్లొ డిగ్రీ పాస్సయ్యి ఉండాలి. ఈ ఉద్యొగాలకు అప్లై చేసుకొనే అభ్యర్థులకు టూ వీలర్ ఖచ్చితంగా ఉండాలని నోటిఫికేషన్ లో స్పష్టం చేశారు. వయస్సు 22 నుంచి ముప్పై ఏళ్ళు ఉండాలని తెలిపారు.రేపే ఈ ఉద్యోగాలకు ఆఖరి తేదీ అని నోటిఫికేషన్ లో వెల్లడించారు. ఈ నెల 22న ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు.. ఎంపిక అయినా అభ్యర్థులు గుంటూరు ( నరసరావు పేట, చిలకలూరి పేట, వినుకొండ, సత్తెనపల్లి, పిడురాళ్ల) సంబంధిత ప్రాంతాల్లో పని చేయాల్సి ఉంటుంది. బ్యాంక్ ఉద్యోగం చేయాలనీ అనుకునేవారికి ఇది మంచి అవకాశం వినియోగించుకోండి.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: