తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రం లో ఖాళీగా వున్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం సెప్టెంబరు 7న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా మొత్తం 5089 ఖాళీలను భర్తీ చేయనున్నారు.అయితే ఉపాధ్యాయ నియామక పరీక్ష తేదీలు, సిలబస్ మరియు అర్హతలను విద్యాశాఖ తాజాగా ప్రకటించింది. ఆన్లైన్ పరీక్ష తేదీలను ఖరారు చేస్తూ.. సెప్టెంబరు 20న అధికారిక ప్రకటన ను విడుదల చేసింది. దీనిప్రకారం నవంబర్ 20 నుంచి 30 వరకు సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయ నియామక పరీక్షల తేదీలను విద్యాశాఖ ఖరారు చేసింది. ప్రతీ రోజూ రెండు విడతల్లో ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుండి 11.30 వరకు మొదటి విడత, రెండో విడతలో మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 4.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. నవంబర్ 20 మరియు 21 తేదీల్లో స్కూల్ అసిస్టెంట్ అన్ని సబ్జెక్టులకు సంబంధించిన పరీక్షలను నిర్వహించనున్నారు. నవంబర్ 22 వ తేదీన స్కూల్ అసిస్టెంట్ లాంగ్వెజ్ సబ్జెక్టులకు సంబంధించిన పరీక్షలు జరగనున్నాయి. నవంబరు 23వ తేదీ న ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టుల అభ్యర్థులకు నిర్వహిస్తారు. నవంబరు 24న లాంగ్వేజ్ పండిట్ అభ్యర్థులకు రెండు విడతల్లో పరీక్షను నిర్వహించనున్నారు.అలాగే నవంబరు 25 నుండి 30 వరకు సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పరీక్షలు నిర్వహించనున్నారు. 

ఎస్జిటీ పరీక్షలను ప్రతీ రోజూ రెండు విడతల్లో నిర్వహించనున్నారు.పరీక్షల తేదీలతోపాటు, పరీక్ష స్వరూపాన్ని కూడా విద్యాశాఖ తెలియజేసింది.. ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్, పీఈటీ పరీక్షలకు సంబంధించిన డిటైయిల్డ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ను విడుదల చేసింది. ఏయే సబ్జెక్టుల నుంచి ఎన్ని మార్కులు ఉంటాయనే వివరాలను కూడా తెలిపింది. ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు 80 మార్కులు, 160 ప్రశ్నలకు గానూ పరీక్ష ను నిర్వహిస్తారు. మిగతా 20 మార్కులు టెట్లో వచ్చిన స్కోర్ను వెయిటేజీగా పరిగణిస్తారు.అలాగే పీఈటీ మరియు పీఈడీ అభ్యర్థులకు మాత్రం 100 మార్కులు, 200 ప్రశ్నలతో ప్రశ్నపత్రం ఉండనుంది.

తెలంగాణ డీఎస్సీ దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబరు 20న ప్రారంభమైంది.అర్హతలున్న అభ్యర్థులు అక్టోబర్ 20లోగా నిర్ణీత ఫీజు చెల్లింపు చేసి అక్టోబరు 21లోగా దరఖాస్తులు సమర్పించాల్సి అయితే ఉంటుంది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం నవంబర్ 20 నుంచి 30 వరకు కంప్యూటర్ ఆధారిత విధానంలో డీఎస్సీ పరీక్షలు నిర్వహించునున్నారు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది

మరింత సమాచారం తెలుసుకోండి: