పోలీస్ కావాలనుకునేవారు టెన్త్ క్లాస్ పాస్ అయితే చాలు జాబ్ గ్యారెంటీ.. ఇప్పుడు తాజాగా SSC GD నోటిఫికేషన్ విడుదలయ్యింది. కేవలం  పదో తరగతి ఉత్తీర్ణులైన వారికి ఇది ఒక మంచి అవకాశం గత నెల 24వ తేదీ నుంచి విద్యార్హత కలిగిన వారు ఈ పోస్టులకు సైతం అప్లై చేసుకోవచ్చు.. ఈ పోస్టుల భర్తీకి 31 తేదీ వరకు దరఖాస్తు చివరి తేదీ అన్నట్టుగా తెలుస్తోంది ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం.

కేంద్ర భద్రత బలగాలలో  కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 26,146  ఖాళీలను భక్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం ఖాళీలలో పురుషులకు 23,347 పోస్టులు అలాగే స్త్రీలకు  2,799 పోస్టులు ఖాళీలను కేటాయించడం జరిగింది. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 24 నుంచే ప్రారంభం కానుంది.

ఒక అభ్యర్థులు దరఖాస్తు ఫీజు కింద రూ .100 రూపాయలు చెల్లించాలి ..డిసెంబర్ 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష.. ఫిజికల్ టెస్ట్ అలాగే ఫిజికల్ స్టాండర్డ్ మెడికల్ టెస్ట్ తో పాటు.. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.. SSC GD ఎగ్జామ్ విషయానికి వస్తే.. 2024 లో రాత పరీక్ష ఉంటుంది. ఇకమీదటSSC ఎగ్జామ్స్ జరిగేటివన్నీ కూడా అన్ని భాషలలో ఎగ్జామ్ పేపర్ నిర్వహించబోతున్నట్లు తెలియజేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం.


ఇందులో మొత్తం పోస్టుల సంఖ్య..CRPF-3337,CISF -11025,BSF -6174,ITBP -3189,AR -1490,SSF -296 పోస్టులు కలవు..

ఈ పోస్టులకు సైతం వయోపరిమితి..01-01-2024 సమయానికి 18 నుంచి 23 సంవత్సరాల మధ్య ఉండాలి.. రిజర్వేషన్ల ఆధారంగా ఏజ్ లో రిలాక్స్ ఉంటుంది. ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి.


ఎంపికైన అభ్యర్థులకు జీతం విషయానికి వస్తే రూ.21,700 నుంచి 69,100 వరకు ఉంటుందట. ఎవరైనా నిరుద్యోగులు సైతం అప్లై చేయాలనుకుంటే వెంటనే చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: