గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం..10 గ్రాములకు 24 క్యారెట్ల బంగారం ధర రూ.340 తగ్గుదలతో రూ.51,720కు క్షీణించింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ.320 దిగొచ్చింది. దీంతో ధర రూ.47,410కు క్షీణించింది. నిన్నటి రేటుతో పోలిస్తే ఈ రోజుకు ధర ఓ మేరకు ఊరట నిస్తుంది. వెండి ధర ఈరోజు మాత్రం అందరికీ షాక్ ఇస్తుంది. కేజీ వెండి ధర ఏకంగా రూ.2,300 పెరిగింది. దీంతో వెండి ధర రూ.64,700కు చేరింది..