పసిడి ప్రియులకు షాక్ ఇచ్చిన ధరలు.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.290 పెరుగుదలతో రూ.51,940కు చేరింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ.270 పైకి చేరింది. దీంతో ధర రూ.47,610కు ఎగసింది. ఇక వెండి కూడా ఇదే దారిలో నడిచింది. ప్రస్తుతం ఈ రేట్లు సామాన్యుడికి అందుబాటులో లేవని చెప్పాలి. ప్రస్తుత మార్కెట్ లో కిలో వెండి ధర రూ.100 పెరిగింది. దీంతో వెండి ధర రూ.65,300కు చేరింది