పసిడి ప్రియులకు మరో భారీ షాక్.. దూసుకెళ్తున్న వెండి.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.830 పెరుగుదలతో రూ.52,380కు చేరింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ.770 పైకి కదిలింది. దీంతో ధర రూ.48,020కు ఒక్కసారిగా పెరిగింది.. కేజీ వెండి ధర రూ.690 పైకి కదిలింది. దీంతో వెండి ధర రూ.65,410కు చేరింది.