పరుగులు పెడుతున్న పసిడి ధరలు..హైదరాబాద్ మార్కెట్లో గురువారం బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.160 పైకి కదిలింది. రూ.49,960కు చేరింది. అదే విధంగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.150 పెరిగింది. దీంతో రేటు రూ.45,800కు చేరింది. కేజి వెండి రూ.600 పైకి ఎగసింది. దీంతో వెండి ధర రూ.71,300కు చేరింది.