పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. శుక్రవారం బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.490 పైకి కదిలింది. రూ.50,450కు చేరింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.450 పెరిగింది. దీంతో రేటు రూ.46,250కు పైకి కదిలింది. ఇక వెండి ధర విషయానికొస్తే.. బంగారం ధరల పైనే ఆధారపడి నడిచింది.