పరుగులు పెడుతున్న పుత్తడి.. హైదరాబాద్ మార్కెట్లో సోమవారం బంగారం ధర పైకి కదిలింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.180 పెరిగింది. దీంతో రేటు రూ.45,830కు చేరింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.160 పెరుగుదలతో రూ.42,010కు ఎగసింది.వెండి ధర కేజీకి ఏకంగా రూ.700 పైకి కదిలింది. దీంతో రేటు రూ.71,400కు చేరింది.