క్యారెట్లు ,బీట్ రూట్ లో వుండే యాంటీ ఆక్సిడెంట్లు ఆరోగ్యాన్ని కాపాడుతాయి. ఇంట్లో దొరికేటువంటి కాయగూరల రసాలు ద్వారా మన కళ్ళను చాలా జాగ్రత్తగా చూసుకోవచ్చు. వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
1). క్యారెట్ రసం దృష్టిని అందించడంలో చాలా ప్రయోజనం ఉంటుంది. ఇందులో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది దృష్టిని మెరుగు పరచడానికీ ఉపయోగపడుతుంది.
2). ఆకుకూరలు కంటి సమస్యలను దూరంగా చేయడానికి సహాయపడుతాయి. ఆకుకూరలు కళ్ళకే కాదు ఆరోగ్యానికి కూడా చాలా మేలు. ముఖ్యంగా పాలకూర రసం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.
3).ఉసిరి రసం లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది కనుక ఇది కంటికి ఎంతో మేలు చేస్తుంది.
4). కంటి ఆరోగ్యం మెరుగు పడాలంటే చేపలను తరచూ తింటూ ఉండాలి. ముఖ్యంగా చేపలు విరివిగా లభించే ఒమేగా-3 ఫ్యాటీ ఆసిడ్ వల్ల కంటి జబ్బులను దూరం చేస్తుంది.
5). మెరుగైన కంటి చూపు కోసం రాత్రి సమయాలలో బ్లూబెర్రీస్ ఖచ్చితంగా తినాల్సి ఉంటుందట.