మనిషి శరీరంలో కళ్ళు కూడా చాలా ముఖ్యమైనవని చెప్పవచ్చు . ఇవి బాగుంటేనే ప్రపంచాన్ని మొత్తం చూడగలరు. లేకపోతే అంధకారమే జీవితం అన్నట్లుగా ఉండాల్సి ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా సుమారు గా 285 మిలియన్ లకు పైగా అంధులు ఉన్నట్లు గుర్తించారు. అయితే మీ కంటి చూపు మంచిగా ఉండడానికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి. అందులో ముఖ్యంగా ఆకు కూరలు, గుడ్లు, క్యారెట్ తినడం వల్ల కంటికి చాలా ప్రయోజనాలు కలుగుతాయి అని నిపుణులు తెలియజేస్తున్నారు. కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యము. ఈ మధ్య కాలంలో చిన్న వయసులోనే దృష్టిలోపం ఎక్కువమందికి ఏర్పడుతూ ఉన్నది. ఇక ఈ మధ్య కాలంలో టెక్నాలజీ పెరగడంతో ప్రతి ఒక్కరూ కూడా మొబైల్ ,ల్యాప్ ట్యాప్ ను ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఆరోగ్య సంరక్షణలో ఆహారం ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉంటుంది.

క్యారెట్లు ,బీట్ రూట్ లో వుండే  యాంటీ ఆక్సిడెంట్లు ఆరోగ్యాన్ని కాపాడుతాయి. ఇంట్లో దొరికేటువంటి కాయగూరల రసాలు ద్వారా మన కళ్ళను చాలా జాగ్రత్తగా చూసుకోవచ్చు. వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

1). క్యారెట్ రసం దృష్టిని అందించడంలో చాలా ప్రయోజనం ఉంటుంది. ఇందులో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది దృష్టిని మెరుగు పరచడానికీ ఉపయోగపడుతుంది.

2). ఆకుకూరలు కంటి సమస్యలను దూరంగా చేయడానికి సహాయపడుతాయి. ఆకుకూరలు కళ్ళకే కాదు ఆరోగ్యానికి కూడా చాలా మేలు. ముఖ్యంగా పాలకూర రసం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.

3).ఉసిరి రసం లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది కనుక ఇది కంటికి ఎంతో మేలు చేస్తుంది.

4). కంటి ఆరోగ్యం మెరుగు పడాలంటే చేపలను తరచూ తింటూ ఉండాలి. ముఖ్యంగా చేపలు విరివిగా లభించే ఒమేగా-3 ఫ్యాటీ ఆసిడ్ వల్ల కంటి జబ్బులను దూరం చేస్తుంది.

5). మెరుగైన కంటి చూపు కోసం రాత్రి సమయాలలో బ్లూబెర్రీస్ ఖచ్చితంగా తినాల్సి ఉంటుందట.

మరింత సమాచారం తెలుసుకోండి: