కొన్ని సింపుల్ హోమ్ టిప్స్ ఉపయోగించి మనం చాలా సులభంగా బల్లులను ఇంట్లో నుంచి తరిమి వేయవచ్చు. బల్లులను తరిమి వేసే టిప్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా మనం ఇంటిని బాగా శుభ్రంగా ఉంచుకోవాలి.ఇంట్లో దుమ్ము, బూజు ఇంకా ధూళి లేకుండా ఇంటిని ఎప్పుడూ చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంట్లో మూలలను ఇంకా అటకల మీద శుభ్రపరుస్తూ ఉండాలి.అలాగే ఇంట్లో చెత్తను, పనికిరాని వస్తువులను ఎప్పటికప్పుడూ కూడా పడేస్తూ ఉండాలి. అలాగే ఇంట్లో శుభ్రంగా  చల్లగా ఉండేలా చూసుకోవాలి. ఇక బల్లులకు వేడి ప్రదేశం అంటే చాలా ఇష్టం. కాబట్టి ఇంట్లో ఎప్పుడూ చల్లగా ఉండేలా చూసుకోవాలి. మన ఇంట్లో చల్లగా ఉంటే బల్లులు ఎక్కువగా ఉండవు. ఇంట్లో నుండి బల్లులు త్వరగా బయటకు పోవాలంటే ఒక స్ప్రే బాటిల్ ని చల్లటి నీటిని తీసుకుని బల్లులు ఎక్కువగా ఉండే ప్రదేశంలో స్ప్రే చేయాలి. ఇలా చేయడం వల్ల బల్లులు చాలా త్వరగా బయటకు పోతాయి. ఇంకా అలాగే ఇంట్లో ఉండే ఏసీ ఆన్ చేయడం వల్ల ఇంట్లో చాలా చల్లగా మారుతుంది. ఇలా చేయడం వల్ల కూడా బల్లులు చాలా ఈజీగా బయటకు పోతాయి. ఇంకా అదే విధంగా బల్లులకు వెల్లుల్లి వాసన కూడా నచ్చదు.


కాబట్టి ఒక స్ప్రే బాటిల్ లో కొద్దిగా నీటిని తీసుకోవాలి.ఆ తరువాత ఇందులో వెల్లుల్లి రసాన్ని వేసి బాగా కలపాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ఇంటి మూలల్లో ఇంకా గోడలపై అలాగే బల్లులు ఎక్కువగా ఉండే ప్రదేశంలో స్ప్రే చేయాలి. ఇలా చేయడం వల్ల కూడా బల్లులు ఈజీగా బయటకి పారిపోతాయి. అలాగే కర్పూరం బిళ్లలను ఉపయోగించి కూడా మనం బల్లులను చాలా ఈజీగా తరిమి వేయవచ్చు. ఇంట్లో అక్కడక్కడ మనం కర్పూరం బిళ్లలను ఉంచడం వల్ల కూడా బల్లులు ఈజీగా పారిపోతాయి. ఇంకా అలాగే బల్లులకు కోడిగుడ్డు వాసన కూడా అస్సలు నచ్చదు. ఇంట్లో మూలలకు ఇంకా తలుపుల దగ్గర కోడిగుడ్డు పెంకులను మీరు ఉంచాలి. ఇక కోడిగుడ్డు పచ్చి వాసన పోగానే ఆ పెంకులను మారుస్తూ ఉంచాలి.ఇంకా అలాగే బల్లులు తిరిగే ప్రదేశంలో నెమలి ఈకలను ఖచ్చితంగా వేలాడదీయాలి. అవి గాలికి అటూ ఇటూ ఊగేలా చూసుకోవాలి. ఇలా చేయడం వల్ల బల్లులు చాలా ఈజీగా పారిపోతాయి. ఈ టిప్స్ వాడడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా చాలా సహజ సిద్దంగా మనం బల్లులను ఇంట్లో నుండి తరిమి వేయవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: