రాత్రి తొందరగా పడుకుంటే పొద్దున్న తొందరగా లేవడం ఈజీ అవుతుంది. అందుకని, రోజూ పడుకునే టైమ్ కంటే ఒక అర గంట ముందు పడుకుని ఒక అర గంట గంట ముందుగా లేవడం మొదలుపెట్టండి. పడుకోవడానికి గంట ముందు నించే లైట్స్ ఆఫ్ చేసి, ఫోన్ ఇంకా లాప్టాప్ పక్కన పెట్టేయండి. నిద్ర పోవడానికి ఒక గంట ముందు వెచ్చగా పాలు తాగడం ఎంతో హెల్ప్ చేస్తుంది. అలారం మీకు చేతికి అందేట్లు కాకుండా దూరంగా పెట్టుకుంటే అలారం ఆపేటప్పటికి మెలకువ వచ్చేస్తుంది. ఆదివారం, సోమవారం తో సంబంధం లేకుండా ఇదే రొటీన్ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి.