మోకాళ్ళ నొప్పులు తగ్గించే మందును ఈ విధంగా తయారు చేసుకోండి... ముందుగా మిక్సీలో మెంతి గింజలను తీసుకుని రుబ్బుకోవాలి. ఇప్పుడు ఈ మెంతిగింజల పొడిని జల్లెడ పట్టి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఆతర్వాత అదే మిక్సీలో నల్ల మిరియాలు వేసి, మిక్సీ వేయండి. మెత్తని పిండిలా వచ్చేందుకు మళ్ళీ జల్లెడ పట్టండి. ఇప్పుడు మళ్లీ అదే మిక్సీ గిన్నెలోకి జీలకర్రను తీసుకుని, మిక్సీ పట్టండి. దీనిని జల్లెడ పట్టి, అన్ని పదార్ధాలను బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని ఒక ఏర్ టైట్(గాలి చొరబడని) కంటైనర్లోనికి తీసుకుని నిల్వచేయండి. ఇప్పుడు ఒక గ్లాస్ నీరు తీసుకుని, అందులో సగం చెంచా మిశ్రమం వేసి కలపండి. ఇది కొంచెం చేదుగా ఉంటుంది. కాబట్టి రుచి కోసం బెల్లం కలుపుకుని తాగొచ్చు.