రోజూ ఒకే సమయానికి పడుకోవటం, లేవటం ద్వారా కంటి నిండా నిద్ర పట్టేలా చూసుకోవచ్ఛు పెద్దవాళ్లు రాత్రిపూట 7-8 గంటలు నిద్రపోయేలా చూసుకోవాలి. పడుకోవటానికి 2-3 గంటల ముందే రాత్రి భోజనం ముగించెయ్యాలి. అలాగే పడుకోవటానికి గంట ముందు నుంచే ఇంట్లో వెలుతురు తగ్గేలా చూసుకోవాలి. కంప్యూటర్లు, టీవీలు, ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్ల వంటి డిజిటల్ పరికరాలన్నీ కట్టేయాలి.