మెడలోని జాయింట్లలో లిగమెంట్లు,టెండన్లు అనబడే పోగుల లాంటి నిర్మాణాలు ఉంటాయి. ఇవి కండరాలు ఎముకలకు కనెక్ట్ అయి ఉండడంవల్ల మెడలు విరిచినప్పుడు సాగుతాయి. తిరిగి మెడను సాధారణ స్థితికి చేర్చినప్పుడు, అలా సాగిన కణాలు తిరిగి యథాస్థానానికి చేరగానే క్రాకింగ్ శబ్దం వినిపిస్తుంది. మెడలు విరగడం వల్ల లిగమెంట్లకు లేదా ఎముకలకు హాని జరిగే ప్రమాదం ఉంది. అంతేకాకుండా స్ట్రోక్ వచ్చే ప్రమాదం కూడా ఎక్కువ. కాబట్టి మెడలు విరవడం మంచిది కాదని డాక్టర్లు సూచిస్తున్నారు.