సంక్రాంతి కానుకగా (జనవరి 12) విడుదలైన మెగాస్టార్ చిరంజీవి చిత్రం మన శంకర వరప్రసాద్ గారు. డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా నయనతార హీరోయిన్గా ,వెంకటేష్ కీలకమైన పాత్రలో నటించారు. కామెడీతో పాటు భారీ యాక్షన్ సీన్స్ ఉండడంతో ఈ సినిమా మెగా అభిమానులకు విపరీతంగా నచ్చేసింది. దీంతో అటు నిర్మాతలను కూడా కమర్షియల్ గా ఈ సినిమా గట్టెక్కించిందని చెప్పవచ్చు. అటు ప్రీమియర్ షో నుంచే ఈ సినిమాకు హిట్ టాక్ వచ్చింది. కానీ ఒక విషయంలో మాత్రం చిరంజీవిలు అభిమాను ఆందోళన చెందుతున్నారు.



ఈ సినిమాను ప్రేక్షకులు ఆస్వాదిస్తున్నప్పటికీ ప్రముఖ సంగీత దర్శకుడుగా పేరు సంపాదించిన ఇళయరాజా అందించిన దళపతి చిత్రంలోని సుందరి కన్నల్ ఒరు సేథి  అనే పాటను ప్రతిసారి ఇందులో ఉపయోగించారు. ఈ  అంశం పైన సోషల్ మీడియాలో కూడా చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా చిరంజీవి, నయనతార కనిపించిన ప్రధాన సీన్లలో కూడా ఈ సాంగ్ కనిపిస్తోంది. దీంతో ఇళయరాజా అనుమతితోనే ఈ పాటను ఉపయోగించారా? లేదా అనే సందేహాలు ఇప్పుడు మొదలయ్యాయి. అందుకు సంబంధించిన రాయల్టీ బాధ్యతలను కూడా క్లియర్ చేశారా అనే ప్రశ్నలు అభిమానుల తలెత్తుతున్నాయి.



గత కొంతకాలంగా ఇళయరాజా కాపీరైట్ విషయంలో చాలా దృఢమైన వైఖరిని చూపిస్తున్నారు. ఇప్పటికే తమిళ హీరోల సినిమాల పైన ఎన్నో కేసులు వేశారు. ఇప్పుడు మన శంకరప్రసాద్ గారు సినిమా విషయంలో కూడా అదే వైఖరి వ్యవహరిస్తారా లేదా అనే విషయం పై అభిమానులు మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమాకు మంచి టాక్ రావడంలో ఈ పాట కూడా కొంత కారణమని అభిమానులు భావిస్తున్నారు. సినిమా ప్రదర్శన విషయంలో ఏవైనా అంతరాయం కలిగిస్తాయా అనే అనుమానాలు కూడా అభిమానులలో మొదలవుతోంది. మరి ఈ విషయం పైన చిరు అభిమానులకు నిర్మాతలు సరైన స్పష్టత ఇస్తారేమో చూడలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: