“తాను ఒకటి తలిస్తే దైవం మరొకటి తలచింది” అన్న సామెత ఈ మధ్యకాలంలో ప్రభాస్ అభిమానుల పరిస్థితికి అచ్చంగా సరిపోతుంది. ‘రాజాసాబ్’ సినిమాపై మొదటి నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రభాస్ అంటే యాక్షన్, పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్, భారీ డైలాగులు, ఫ్యాన్ మాస్‌కు కావాల్సిన ఎలివేషన్లు అన్నీ ఉంటాయని ఫ్యాన్స్ ఊహించుకున్నారు. అలాగే దర్శకుడు మారుతి పేరు వినగానే “కనీసం ఒకసారి థియేటర్‌లో చూసేంత కంటెంట్ ఉంటుందన్న నమ్మకం” కూడా ప్రేక్షకుల్లో ఉండేది.కానీ ‘రాజాసాబ్’ విడుదలైన తర్వాత పరిస్థితి పూర్తిగా తలకిందులైంది. సినిమా చూసిన ప్రేక్షకులలో చాలా మంది “ఇది నిజంగా ప్రభాస్ సినిమాేనా?” అనే స్థాయిలో డౌట్స్ వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మారుతి అభిమానులు కూడా ఈ సినిమా తర్వాత ఆయనపై ఉన్న నమ్మకం కొంత తగ్గిందని సోషల్ మీడియాలో ఓపెన్‌గా మాట్లాడుకుంటున్నారు.

సినిమా విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో ‘రాజా సాబ్’పై నెగిటివ్ రివ్యూలు వరదలా వచ్చాయి. స్టోరీ, స్క్రీన్‌ప్లే, ట్రీట్మెంట్, ప్రభాస్ క్యారెక్టర్ ప్రెజెంటేషన్—అన్నింటిపైనా తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. “ఇంత పెద్ద స్టార్‌తో ఇలాంటి స్క్రిప్ట్ ఎలా చేశారు?”..“ప్రభాస్ ఇమేజ్‌ను పూర్తిగా వృథా చేశారు”..“మారుతి స్థాయికి ఇది సరిపోదు” అంటూ ఫ్యాన్స్ నుంచి సాధారణ ప్రేక్షకుల వరకు తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.కలెక్షన్ల పరంగా కూడా టాప్ లెవెల్‌లో దుమ్ము దులిపేస్తుందన్న ప్రచారం ఉన్నప్పటికీ, వాస్తవ పరిస్థితి మాత్రం అంత బలంగా లేదని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. పాజిటివ్ టాక్ లేకపోవడం వల్ల సినిమా లాంగ్ రన్‌లో నిలబడటం చాలా కష్టమని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇప్పుడు పరిస్థితి ఇంత నెగిటివ్‌గా మారడంతో ‘రాజా సాబ్’ టీమ్ కూడా పెద్దగా రికవరీ చేయలేని స్థితిలో ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్. ప్రమోషన్లు, డ్యామేజ్ కంట్రోల్ ప్రయత్నాలు చేసినా, ప్రేక్షకుల మైండ్‌సెట్ మారడం అంత సులువు కాదని అంటున్నారు.ఇలాంటి క్లిష్ట సమయంలోనే ప్రభాస్ తన రాబోయే సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారన్న వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. ‘రాజా సాబ్’ ఫలితం ఆయనకు ఒక పెద్ద లెసన్‌గా మారిందని చెబుతున్నారు.ప్రభాస్ ఇప్పుడు స్క్రిప్ట్ ఎంపిక విషయంలో మరింత కఠినంగా మారారని సమాచారం. ఫ్యాన్స్ తన నుంచి ఏమి ఆశిస్తున్నారు? ఏ రకమైన పాత్రలు, ఏ రకమైన ఎలివేషన్లు కావాలి? అన్న అంశాలను చాలా లోతుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటున్నారట.

‘స్పిరిట్’, ‘ఫౌజీ’, ‘కల్కి 2’పై ప్రత్యేక దృష్టి పెట్టారు.ఈ మూడు సినిమాల్లో ఫ్యాన్స్ కోరుకునే పవర్, ఇంటెన్సిటీ, మాస్ ఎలిమెంట్స్ తప్పకుండా ఉండేలా మార్పులు చేస్తున్నారని టాక్.ఇప్పటికే షూట్ అయిన కొన్ని సీన్లను కూడా అవసరమైతే పూర్తిగా తొలగించి, కొత్తగా కాల్ షీట్లు తీసుకుని మళ్లీ షూట్ చేయడానికైనా ప్రభాస్ సిద్ధంగా ఉన్నారట. “ఫ్యాన్స్ కోరుకునే ప్రభాస్‌ను తిరిగి తెరపై చూపించాలి” అన్న ఒకే లక్ష్యంతో ఆయన డైరెక్టర్లను కూడా స్పష్టంగా కోరుతున్నారట.

అభిమానుల నమ్మకాన్ని తిరిగి గెలుచుకోవడమే లక్ష్యం:

‘రాజాసాబ్’ వల్ల వచ్చిన నెగిటివ్ ఇంపాక్ట్‌ను తొలగించాలంటే, తన రాబోయే సినిమాలు సూపర్ స్ట్రాంగ్‌గా ఉండాలని ప్రభాస్ భావిస్తున్నారని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. కేవలం మార్కెట్ మీద కాకుండా, కంటెంట్, క్యారెక్టర్, ప్రెజెంటేషన్ మీద పూర్తి ఫోకస్ పెట్టి ముందుకు వెళ్తున్నారట.ఈ వార్తలే ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. “ప్రభాస్ ఈసారి తప్పకుండా స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ ఇస్తాడు” అన్న నమ్మకం ఫ్యాన్స్‌లో మళ్లీ మెల్లగా మొదలవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: