చలి కాలం మనపై ఉంది మరియు చల్లని వాతావరణం ఎవరినీ విడిచిపెట్టదు. మీ చర్మ సంరక్షణ మరియు మేకప్ దినచర్యలో చలి కాలానికి  అనుగుణంగా మార్పులు చేర్పులు చేయక  పోతే మీ చర్మం పొడి, పాచీ  నీరసంగా మారుతుంది.  మీ దినచర్య తీవ్రంగా మార్చవలసిన  అవసరం లేదు, కానీ మీరు మీ చర్మాన్నిపొడి పడకుండా , హైడ్రేటింగ్గ వుండేటట్టు   తేమ ఉత్పత్తులు వాడి  చర్మాన్ని  ప్రకాశవంతంగా ఉండేలా చూసుకోవడానికి మార్గం సుగమం చేసుకోవాలి. అసలే చలి కాలం విపరీతమైన ప్రభావాన్ని చూపెడుతుంది. 

 

టింటేడ్ మాయిశ్చరైజర్లు:

 మేకప్ మార్కెట్  చాక్-ఎ-బ్లాక్, టింటేడ్ మాయిశ్చరైజర్లు, బిబి క్రీములు మరియు సిసి క్రీములతో నిండి ఉంది. ఫౌండేషన్ తొందరగా డ్రై అవుతుంది దాని  స్థానంలో టింటేడ్ మాయిశ్చరైజార్లను ఎన్నుకోండి. అవి పోషణను అందించడమే కాక, మీరు లక్ష్యంగా పెట్టుకున్న స్కిన్ టోన్‌ను కూడా ఇస్తాయి. మీరు పార్టీ లేదా పెళ్లి కోసం మేకప్ చేయాలనుకుంటే ఫౌండేషన్ వాడండి,  రోజువారీ మేకప్  కోసం టింటేడ్  మాయిశ్చరైజర్‌నే  మీరు  ఎంచుకొండి.

 

ఆయిల్ -బేసెడ్ ఫౌండేషన్:

పౌడర్- బేసెడ్ లేదా మ్యాటిఫైయింగ్ ఫౌండేషన్లను వాడకండి, ఎందుకంటే అవి మీ చర్మం ఎండిపోయేలా చేస్తాయి మరియు మీ మేకప్  చెదురుమదురుగా కనిపిస్తుంది. ఆయిల్ బేసెడ్ ఫౌండేషన్ వేసుకునేముందు మీ చర్మాన్ని బాగా మాయిశ్చరైజ్  చేసుకోండి. ఇది మీ చర్మన్నీ  రిఫ్రెష్ మరియు మెరిసేటట్టు చేస్తుంది. ఈ సీజన్‌లో  ఇది ఒక హైడ్రేషన్ మంత్రం. 

 

 

లిప్ బామ్స్:

ఈ సీజన్లో లిప్ బామ్స్ మీకు మంచి స్నేహితునిగా పని చేస్తాయి.  మీ పెదవులు ఆరోగ్యవంతంగా  మరియు మాయిశ్చరైజ్ గా ఉండటానికి మీకు ఇష్టమైన రుచిలో చాప్ స్టిక్ ఎంచుకోండి.  లిప్ బామ్ పెట్టిన ౩౦ సెకన్ల తర్వాత లిప్ స్టిక్ ను వాడండి.

 

 

ఫేస్ మిస్ట్:

కాంపాక్ట్‌కు బదులుగా ఫేస్ మిస్ట్‌ను  మీ మేకప్‌ లో  భాగం చేయడం  ఒక మంచి చిట్కా. పొడి వాతావరణం ఈ కాలంలో మేకప్ వేసుకోవడం కష్టతరం చేస్తుంది. కాంపాక్ట్‌ మీ చర్మాన్ని డ్రై చేస్తుంది, దానికి బదులు ఫేస్ మిస్ట్‌ వాడండి. ఫేస్ మిస్ట్‌ మీ ముఖాన్ని రిఫ్రెష్ చేసి మేకప్ ఈజీ గా చేసుకోవడానికి సహాయపడుతుంది. చలి కాలం లో మేకప్ చేతితో కాకుండా బ్రష్లు లేదా స్పాంజ్లు ఉపయోగించి  చేసుకోండి .

 

మరింత సమాచారం తెలుసుకోండి: