క్యారెట్.. కూరగాయలలో తియ్యటి కూరగాయ ఇది. అందుకే దీన్ని ప‌చ్చిగానే చాలా మంది తింటుంటారు.  అందరికీ తెలిసిన క్యారెట్‌ దుంపల‌లో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి అన్న విష‌యం కూడా అంద‌రికీ తెలుసు. ఇందులోని అధిక క్యాలరీలు పిల్లలు శారీర కంగా, మానసికంగా ఎదిగేలా చేయడమే కాక మేధో వికాసానికి ఎంతో తోడ్పడతాయని వైద్యులు చెబుతున్నారు. క్యారెట్ లో ఉండే విటమిన్ ఎ.. చర్మానికి గ్రేట్ గా సహాయపడుతుంది. చర్మం ప్రకాశవంతంగా మెరిసేలా చేస్తుంది. అలాగే క్యారెట్లో ఉండే సి, కె, మిటమిన్లు, పొటాషియం ఎక్కువగా ఉంటాయి. ఇవి శ‌రీరంలో వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది.

 

అయితే షుగ‌ర్ పేషెంట్స్ క్యారెట్ తిన‌వ‌చ్చా..? అన్న ప్ర‌శ్న మీకు వ‌చ్చిందో.. రాలేదో.. ప‌క్క‌న పెడితే..  షుగర్ వ్యాధితో బాధపడేవారు క్యారెట్స్‌ను  తీసుకోకపోవడమే మంచిదని చెబుతున్నారు నిపుణులు. క్యారెట్‌లో షుగర్ కంటెంట్ హై గ్లిజమిక్స్ 97 ఉంటుంది. ఇది గ్లూకోజ్‌గా మారడంతో బ్లడ్ షుగర్ లెవల్స్ అధికంగా పెరుగుతాయి. కాబట్టి వీటిని షుగర్ పేషెంట్స్ ఎక్కువగా తీసుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే డయాబెటిక్ పేషెంట్స్ వీటిని ఎక్కువగా తినడం వల్ల ఇరిటేషన్, నిద్రలమేమి, నీరసం ఎక్కువగా మారడం వంటి సమస్యలను ఎదుర్కొంటారని తెలిపారు.

 

అయితే షుగ‌ర్ పేషెంట్స్ కాకుండా.. మిగిలిన వారి వీటిని పుష్క‌లంగా తీసుకోవ‌చ్చు. క్యారెట్ లో ఉండే సోడియం కంటెంట్ బ్లడ్ ప్రెజర్ కంట్రోల్ చేస్తుంది. క్యారెట్ ను రెగ్యులర్ గా తినడం వల్ల బిపి కంట్రోల్లో ఉంటుంది. అలాగే క్యారెట్‌ రసంలో కాస్త తేనె కలిపి, తీసుకోవడం వల్ల జలుబు, గొంతునొప్పి త్వరగా తగ్గుతాయి. క్యారెట్‌లో రక్తహీనతను పోగొట్టే గుణం ఉంది. రక్తహీనతకు కూడా క్యారెట్‌ దివ్య ఔషధంగా పనిచేస్తుంది. మ‌రియు రెగ్యులర్ గా క్యారెట్ తినడం వల్ల లివర్ క్యాన్సర్ రిస్క్ తగ్గిస్తుంది. లంగ్ క్యాన్సర్, కోలన్ క్యాన్సర్ ను తగ్గించడంలో క్యారెట్ గ్రేట్ గా సహాయపడుతుంది.

 


 

మరింత సమాచారం తెలుసుకోండి: