భోజనం చేసిన తర్వాత చాలా మందికి నిద్ర వస్తుంది. ఎందువల్లో తెలుసా మీకు మనం బోజనము చేసిన తర్వాత  ఆహారాన్ని  జీర్ణం  చెయ్యటానికి  మన కడుపులో  జఠరాగ్ని ఉత్పత్తి అవుతుంది. అప్పుడు మెదటగా మెదడు లోని రక్తం , తర్వాత ఇతర అవయవాల్లోని రక్తమంతా తిన్న ఆహారాన్ని జీర్ణం  చేయడానికి పొట్ట భాగానికి చేరుతుంది.  అపుడు మన  మెదడు విశ్రాంతిని కోరుకుంటుంది.అందు వలన నిద్ర వస్తుంది.అయితే బోజనము చేసిన తర్వాత నిద్రపోవడం అనేది మంచిదే కానీ ఆ నిద్ర కూడా కొన్ని నియమాలు అనుసరించి పోవాలి.  


మనం  మధ్యాహ్న భోజనం తర్వాత 30 నుండి 40 నిమిషాల వరకు ఖచ్చితంగా నిద్ర పోవలెను . విశ్రాంతి తీసుకునే అవకాశం లేని వారు కనీసం 10 నిమిషాల పాటు వజ్రాసనం వేయండి . కానీ  రాత్రి పూట  భోజనం తర్వాత ఎట్టి పరిస్థితులలోను వెంటనే నిద్ర పోకూడదు . కనీసం రెండు గంటల  తర్వాత నిద్ర పోవాలి. మీరు వెంటనే నిద్ర పోవడం వలన డయాబెటీస్, హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదముంది . అలా వెంటనే రాత్రి పూట పడుకుంటే తిన్న ఆహారం మొత్తం కొవ్వు రూపంలో శరీరానికి పడుతుంది.  పడుకునే అప్పుడు  తప్పకుండా ఎడమ ప్రక్కకు తిరిగి  పడుకొని విశ్రమించాలి. ఎందుకని అన్నా అనుమానం మీకు వస్తుంది.



దానికి  కారణం ఉంది ఎందుకంటే మన శరీరంలో సూర్యనాడి , చంద్ర నాడి మరియు మధ్యనాడి  అనే మూడు నాడులున్నాయి . సూర్యనాడి భోజనాన్ని జీర్ణం చెయ్యటానికి పనికొస్తుంది . ఈ సూర్య నాడి ఎడమ వైపు తిరిగి పడుకుంటే చక్కగా పని చేస్తుంది .మీరు అలసత్వానికి గురైయినపుడు , ఇలా ఎడమ వైపున తిరిగి పడుకొనుట వలన అలసత్వం తొలగి పోతుంది. గురక తగ్గి పోవును . . గర్బిణీ స్త్రీలకు మంచి రక్త ప్రసరణ జరుగుతుంది . గర్బాశయంకు , కడుపులోని పిండమునకు మరియు మూత్ర పిండాలకు చక్కని రక్త ప్రసరణ జరుగును . వెన్ను నొప్పి , వీపు నొప్పుల నుండి ఉపశమనం కలుగును .


 భోజనం తర్వాత జరిగే జీర్ణక్రియలో సహాయ పడుతుంది . వీపు , మెడ నొప్పులున్నవారు ఉపశమనం పొందుతారు.  తీవ్రమైన అనారోగ్యానికి కారణమైన విష పదార్ధాలు బయటికి నెట్టి వేయ బడును. జీర్ణక్రియ ప్రక్రియ కూడా మెరుగుపడుతుంది. కాలేయం మరియు మూత్ర పిండాలు సక్రమంగా పని చేస్తాయి . ఉదయం అలసట లేకుండా ఉత్సాహంగా వుంటారు .మెదడు చురుకుగా పని చేస్తుంది దీనివల్ల మతిపరుపు అనేది రాదు.ఒకసారి ఎడమవైపు పడుకుని చుడండి. తేడా మీరే గమనించండి.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: