అరటిపండు తొక్కలను గుజ్జు గుజ్జుగా చేసి గులాబీ మొక్కల కుండీలలో ఉండే మట్టిలో ఈ గుజ్జు కలపడం వల్ల మొక్కకు కావలిసిన పొటాషియం అంది, పూలు చక్కగా పూస్తాయి.

 కొత్తిమీర కాడలు, ఆకుకూర కాడలు ముదిరిపోయినవి, కొల్లిపోయినవి ఉంటే వాటిని మొక్కల మొదళ్లలో వేయడం వల్ల మంచి ఎరువుగా ఉపయోగపడుతుంది.

 ఇంట్లో ఉండే కుర్చీలు వంటి ఫర్నిచర్ కి రంగులు వేసేటప్పుడు కాళ్ల కింద సీసా మూత లు పెట్టడం వల్ల ఫ్లోర్ కు రంగు అంటకుండా ఉంటుంది.

 ఉల్లిపాయలు కడిగిన నీటిని ఇంట్లో ఉండే మొక్కలకు పోయడం వల్ల మొక్కల్లో కీటకాలు చేరకుండా ఉంటాయి.

 ఇంట్లోకి దోమలు, ఈగలు రాకుండా ఉండాలంటే ఇల్లు తుడిచే నీళ్లల్లో కొద్దిగా ఉప్పు వేస్తే ఇవి రాకుండా ఉంటాయి.

 ఈగలను ఇంట్లో నుంచి బయటకు పోవడానికి మిరియాలు బాగా పనిచేస్తాయి.

 కొబ్బరి నూనె గడ్డ కట్టకుండా ఉండాలంటే కొబ్బరి నూనెలో కొన్ని చుక్కలు ఆలీవ్ నూనెను కలపాలి.

 కొవ్వొత్తుల వత్తుల అంచుల్ని సగం వరకు కత్తిరిస్తే ఎక్కువ సేపు స్థిరంగా వెలుగుతాయి.

 రాగి పాత్రలు తళతళ మెరవాలంటే చింతపండుతో పాటు కొంచెం ఉప్పు వేసి తోమితే మెరుస్తాయి.

 తాళాలు తుప్పుపట్టి ఉంటే కిరోసిన్లో ముంచిన బట్టతో తుడవడం వల్ల కొత్త వాటిలా ఉంటాయి.

 ఒక ఉల్లిగడ్డ ను తీసుకొని తులసి మొక్క అడుగు భాగాన పాతి ఉంచితే తులసి మొక్కను పురుగు తినకుండా ఉంటుంది.

 బియ్యం పురుగు పట్టకుండా ఉండాలంటే ఎండిన కాకరకాయను వస్త్రంలో కట్టి బియ్యపు డబ్బాలో వేస్తే పురుగు చేరకుండా ఉంటుంది.

 ప్లాస్టిక్ కంటైనర్ కి పసుపు మరకలు అయితే సున్నిపిండిలేదా శెనగపిండితో రుద్దితే మరకలు మాయమవుతాయి.

 బాత్రూం వాసన వస్తుంటే బేకింగ్ సోడా ను కొద్దిగా ప్లేట్లో
 వేసి బాత్రూం లో పెట్టడం వల్ల వాసన రాదు.                                                                                                                                                                                                                                                            

మరింత సమాచారం తెలుసుకోండి: