మిరియాలను అనేక వంటకాల్లో వాడుతారు. వీటివల్ల వంట రుచిగానూ, మంచి వాసన కలిగి ఉంటుంది. అనేక వ్యాధుల నివారణకు కూడా వాడుతారు.ఆయుర్వేద ఔషధాల్లో వీటిని విరివిగా వాడతారు. మిరియాల్లో ఔషధ గుణాలు చాలా ఉన్నాయి. వీటితో పాటు ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి వాటి గురించి ఇప్పుడు చర్చించుకుందాం...

 గ్రాము మిరియాలు తీసుకుని వేయించి పొడి కొట్టుకోవాలి.చిటికెడు లవంగాల పొడి, పావు స్పూన్    వెల్లుల్లిరసం, గ్లాసు నీళ్లు పోసి బాగా మరగనివ్వాలి,వడగట్టి తేనె కలుపుకొని తాగడం వల్ల జలుబు, దగ్గు, ఆయాసం వంటి వాటి నుండి ఉపశమనం కలుగుతుంది.

 మిరియాల పొడిలో తగినంత బెల్లం కలిపి మెత్తగా నూరి ఉండల మాదిరి చేసుకోవాలి.వీటిని రోజూ భోజనానికి ముందు పోవడం వల్ల అజీర్తి సమస్య తగ్గిపోతుంది.ఆహారం తొందరగా జీవితం అవుతుంది.

 అధిక బరువుతో బాధపడుతున్న వారు అర గ్రాము మిరియాల పొడి తేనెతో కలిపి తీసుకొని వేడి నీళ్లు తాగాలి.  ఇలా చేయడం వల్ల బరువు తగ్గుతారు. దప్పిక ఎక్కువగా ఉన్నప్పుడు మిరియాల పొడి వేడి నీటితో తాగితే దప్పిక తీరుతుంది.

 పసుపు, చిటికెడు మిరియాల పొడి, నీళ్లలో బాగా మరిగించి రాత్రిపూట తాగడం వల్ల తరచూ వచ్చే తుమ్ములు, జలుబు తగ్గిపోతాయి.

 చిటికెడు రాళ్ల ఉప్పు,  కొంచెం మిరియాల పొడి కలిపి ఆ మిశ్రమాన్ని చిగుళ్ళకు రాసి పుక్కలించడం వల్ల చిగుళ్ల వాపు, నోటి నుంకీళ్ల వాతం తో బాధపడే వాళ్ళు కి మిరియాలను, నవ్వులను వేయించి పొడి చేసి ఆ పొడిని నొప్పి ఉన్న చోట కడితే నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.

 మొటిమలు ఎక్కువగా ఉంటే మిరియాల పొడిని పసుపుతో కలిపి మూడు నాలుగు రోజులు ముఖానికి రాసుకుంటే మొటిమలు ఇట్టే తగ్గిపోతాయి.

 గొంతు గరగర ఉంటే గోరువెచ్చని పాలలో మిరియాల పొడి,పసుపు అర స్పూన్ చొప్పున తేనెతో కలిపి తీసుకోవడం వల్ల గొంతు గరగర తగ్గిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: