చాలామందికి పాదాలు పగిలి నొప్పితో బాధపడుతుంటారు. ఎన్ని క్రీములు రాసినా కొద్ది సేపు మాత్రమే ఉపశమనంగా ఉంటుంది. ఆ తర్వాత మళ్లీ నొప్పి మొదలవుతుంది. ఇలాంటి  సమయంలో వంటింట్లో దొరికే వాటితోనే పాదాల పగుళ్ళను నయం చేయవచ్చు. అంతేకాకుండా పాదాలను అందంగా తయారుచేయవచ్చు. ఆ చిట్కాల  గురించి ఇప్పుడు తెలుసుకుందాం...                                                       

 క్యారెట్ తీసుకుని తురుము కోవాలి. ఈ తురుము లోకి రెండు టేబుల్ స్పూన్ల గ్లిజరిన్ కలిపి పాదాలకు బాగా మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల పాదాలు మృదువుగా మారతాయి.

 అర టీ స్పూన్ పసుపు కొబ్బరి తురుము అర కప్పు తీసుకొని రెండింటినీ బాగా కలపాలి. తర్వాత పాదాలకు బాగా మర్దన చేయాలి. కొద్దిసేపు తర్వాత నీళ్ళతో కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల పాదాలు మృదువుగా మారతాయి.

 అరికాళ్ళు మృదువుగా ఉండాలంటే పాదాలను తరచూ కొబ్బరినూనెతో మర్దన చేస్తూ ఉండాలి. చేయడంవల్ల పాదాలు అందంగా ఉంటాయి.

 కీరా జ్యూస్ లో కొంచెం బియ్యప్పిండి కలిపి మెత్తగా  పేస్ట్  తయారు చేయాలి. ఈ పేస్ట్ ను పాదాలకు బాగా అప్లై చేయాలి. కొద్దిసేపు తర్వాత కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పాదాల పగుళ్లు తగ్గడమే కాకుండా, పాదాలు మృదువుగా ఉంటాయి.

 కొంతమందికి పాదాల మడమలు బిరుసు  చర్మంతో ఉంటాయి. ఇలాంటి వారు నిమ్మరసం, పంచదార కలిపి మడమల  వద్ద మర్దన చేయాలి. ఇలా చేయడంవల్ల మంచి ఫలితం కలుగుతుంది.

 ఒక టేబుల్ స్పూను శనగపిండిలో కొద్దిగా పుల్లని పెరుగు, కాస్త పసుపు కలిపి పాదాలకు పట్టించి ఆరిన తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పాదాలపై ఉన్న మృత  కణాలు చనిపోయి పాదాలు అందంగా కనపడతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: